AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపులోకి తెచ్చి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రుల బృందం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించింది.
ఈ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 115 రైతు బజార్లు, మొబైల్ షాపుల ద్వారా కిలో ఉల్లిపాయలను కేవలం 32 రూపాయలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును కేటాయించేందుకు అంగీకరించిన నేపథ్యంలో, నాదెండ్ల మనోహర్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ కందిపప్పును 20 నుండి 30 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే త్వరలోనే పామాయిల్ నూనెను కూడా రీజనబుల్ ధరకే అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పంపిణీ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,306 చౌక ధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారా నిర్వహించనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు పంచదారను కూడా నిరంతరం సరఫరా చేస్తున్నారు.
దీంతో పాటు అక్టోబర్ 1వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ‘మీ మార్ట్’ (Me Mart) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రముఖ సూపర్‌మార్కెట్ ‘డీ మార్ట్’కు దీటుగా ఈ ‘మీ మార్ట్’ల ద్వారా 64 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ పరిమాణంలో (స్మాల్ ప్యాకెట్లలో) కూడా సామాన్యులకు తక్కువ ధరలకే లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!