జీపీఎఫ్ విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఆహ్వానం లేకుండా జీఓఎం సమావేశం నిర్వహించారని, హైకోర్టు ఉత్తర్వులతో మాకు ఇటీవల జరిగిన సమావేశానికి పిలిచారన్నారు. ఏప్రిల్ లో జీపీఎఫ్ సొమ్ము మా ఖాతాలలో వేసేసామని ఆర్ధిక శాఖ కార్యదర్శి చెప్పారని, మేం ప్రశ్నిస్తే మరోసారి చూసుకుని చెపుతానని ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ చెప్పారన్నారు. మూడు నెలల కు మించి చెల్లించని జీపీఎఫ్ పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ జీతం నుంచీ చెల్లించాలని మా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగకపోవడంతో ఆ సొమ్ము 13 వేల కోట్లు ఉంటుందని మా సంఘం భావిస్తోందని, మా జిపీఎఫ్ ఏ ప్రభుత్వం వచ్చినా వేరేలా వినియోగించకుండా డిపాజిట్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. బ్రిటీషు నాటి జీపీఎఫ్ చట్టం కొన్ని మార్పులతో ఇప్పటికీ అమలులో ఉందని, డీటీఏ నివేదిక ఇచ్చారా.. ఇస్తే.. ఆ నివేదికలో ఏముందో ప్రభుత్వం చెప్పాలన్నారు.
Also Read : Recovering From Depression: డిప్రెషన్ నుండి ఉపశమనం ఎలా ?
‘486 కోట్ల జీపీఎఫ్ ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని కేంద్ర ఆర్ధికమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జీపీఎఫ్ అక్రమ విత్ డ్రా పై ఎవరి మీద కంప్లైంట్ చేయాలో అనే సందిగ్ధత నెలకొంది. నిన్న జరిగిన సమావేశానికి మమ్మల్ని పిలవలేదు. అనధికారిక సమావేశం అని ప్రకటించడం.. మమ్మల్ని పిలవకపోవడానికి కారణంగా భావిస్తాం. మంత్రి పిలిచిన సంఘాలకు ఏ విధమైన చట్టబద్ధత ఉంది. ఏ నిబంధనల ప్రకారం ఆ సంఘాలను ఫెడరేషన్ చేసి సమావేశాలకు పిలిచారో ప్రభుత్వం చెప్పాలి. హక్కును మీ దయ కాదు అనడం మా విధానం. మా విధానం సామరస్య ధోరణి కాదు అని ప్రభుత్వం భావిస్తోందా. బొప్పరాజు ఆధ్వర్యంలో కొన్ని అందోళనలు జరిగాయి..అది ఉద్యమంగా మేం భావిస్తాం. మరే సంఘాలూ ఉద్యమం చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున ఉద్యోగులున్నారో ఓటింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ఉద్యోగులు నిర్ణయించిన సంఘం ఏదైనా ఆ సంఘం తరఫున మేం పని చేయడానికి సిద్ధం. ఈనెల 30న రాజమండ్రిలో రాష్ట్ర స్ధాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Andrea Jeremiah : ‘సైంధవ్ ’తో యాక్షన్లో జాస్మిన్.. గన్నుతో మామూలుగా లేదు