Andrea Jeremiah : ‘సైంధవ్ ’తో యాక్షన్లో జాస్మిన్.. గన్నుతో మామూలుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andrea Jeremiah : టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇది ఇలా ఉంటే వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు. అగ్ర నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బొబ్బిలిరాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే అందరూ వెంకటేష్ అనే చెబుతారు. వెంకటేష్ అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులు మెప్పించారు. ఇటీవలే ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. వెంకటేష్ తో పాటు రానా కూడా దీనిలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..
Also Read
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
కానీ గత కొద్ది రోజులుగా వెంకటేష్ సోలోగా సక్సెస్ సాధించలేకపోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వెంకటేష్ తో పాటు ఉన్నటువంటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ రూ.100 కోట్ల కలెక్షన్లు ని కొల్లగొడుతుంటే వెంకటేష్ మాత్రం ఇంకా సోలో సక్సెస్ కోసం చాలా కష్టాలు పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో వెంకటేష్ రూట్ మార్చి హిట్ సిరీస్ లో టాలెంట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్నటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే టైటిల్ తో ఓ పవర్ పుల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. మొదటిసారి శైలేష్ కొలను ఓ స్టార్ హీరోని డీల్ చేస్తున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం తప్పకుండా వస్తుండొచ్చు.
Read Also: Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా
ఇదిలా ఉంటే, వెంకటేష్ సైంధవ్ సినిమాతో తమిళ కథానాయిక ఆండ్రియా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం ఆండ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో రివాల్వర్ తో స్పోర్ట్స్ బైక్ ముందు నిల్చొని స్టైలిష్ లుక్‌లో ఆండ్రియా కనిపిస్తోంది. సైంధవ్ మూవీలో యాక్షన్ పాత్రలో ఆండ్రియా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో దాదాపు పదేళ్ల తర్వాత ఆండ్రియా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివరగా తెలుగులో నాగచైతన్య, సునీల్ హీరోలుగా నటించిన తడాఖా సినిమాలో నటించింది. హిట్ – 2 తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
Introducing JASMINE from SAINDHAV 🔥#SaindhavOnDec22
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/I6L1W5cJjI
— Andrea Jeremiah (@andrea_jeremiah) April 28, 2023
తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..