Governor Abdul Nazeer: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు, మెరిట్‌గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. మరోవైపు.. ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్ద పీట వేస్తోందన్న ఆయన.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీ చాలా ముందు ఉందని కితాబిచ్చారు.. ఇక, కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారు.. కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
Read Also: Bastar :మరో కాంట్రవర్సీయల్ మూవీతో రాబోతున్న అదాశర్మ..బస్తర్ టీజర్ రిలీజ్..
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 1,0132 విలేజ్ హెల్త్ కేర్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. 1,0142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా హాస్పిటల్స్, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 అర్బన్ పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో ఏర్పటు అవుతోన్న 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.
