ది కేరళ స్టోరీ మూవీతో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అదాశర్మ ఇప్పుడు ‘బస్తర్’ అనే మరో కాంట్రవర్సీయల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 6) న రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కేవలం అదాశర్మ తప్ప మిగిలిన నటీనటులు ఎవరిని కూడా చూపించలేదు. బస్తర్ మూవీలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది.నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ టీజర్‌లో ఆసక్తిని పెంచుతోన్నాయి. బోర్డర్‌లో పాకిస్థాన్‌తో పోరాడుతూ కన్నుమూసిన జవాన్ల కంటే నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువ అంటూ టీజర్‌లో అదాశర్మ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి .బస్తర్ లో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్‌లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తున్నాయి.
ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. బస్తర్ టైటిల్‌కు ది నక్సల్ స్టోరీ అనే క్యాప్షన్‌ను జోడించారు. చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా అదా శర్మ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ సీరియస్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది.. బస్తర్ మూవీకి ది కేరళ స్టోరీకి పనిచేసిన సాంకేతిక నిపుణులే పనిచేయనున్నారు.. కేరళ స్టోరీని నిర్మించిన విపుల్ అమృత్‌లాల్ షా బస్తర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.మార్చి 15న పాన్ ఇండియన్ లెవెల్‌లో బస్తర్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..ఈ మూవీని హిందీతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బస్తర్ సినిమా సెన్సార్ అడ్డంకులను దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.