Site icon NTV Telugu

AP Assembly: రెండో రోజు ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఏపీలో రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది. ధన్యవాదాల తీర్మానంపై చర్చను కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని గౌతు శిరీష బలపరచనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
పాఠశాలల్లో నాడు – నేడు, కొత్త పాలిటెక్నిక్-ఐటీఐలు, వలంటీర్ల వ్యవస్థ, వీఆర్ లో ఉన్న ఇన్స్ పెక్టర్ల సమస్యలు, 2022-గ్రూప్-1 పోస్టుల ఇంటర్వూలు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడ్రనైజేషన్.

మండలిలోనూ అదే అజెండా
రెండో రోజు మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని పంచుమర్తి అనూరాధ బలపరచనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలు.

 

Exit mobile version