AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కేజీ ఉల్లిని రూ.35కే అందించాలని నిర్ణయించారు.
ధరల స్థిరీకరణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి దశలో భాగంగా విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రాయితీ ఉల్లి విక్రయ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Also Read
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రాయితీ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా నిబంధనలు రూపొందించారు. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుని ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల చొప్పున సబ్సిడీ ఉల్లిపాయలను అందజేస్తారు. తొలుత ప్రధాన నగరాల్లో ఈ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లకు ఈ విక్రయాలను విస్తరించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NCCF సహకారంతో ఈ ఉల్లిపాయలను సేకరించి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధరల భారం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కూడా తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!