NTV Telugu Site icon

Sand Mafia: ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్

Sand

Sand

Sand Mafia: ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకొనేందుకు టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

Read Also: Rammohan Naidu: నాగావళి – వంశధారను అనుసందానం చేస్తాం..

డ్రోన్ కెమెరాలతో స్టాక్ యార్డులు, చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లకు ఉన్న జీపీఎస్‌లను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. అనధికారిక ఇసుక డంప్‌లను నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలను సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు.