Site icon NTV Telugu

Amaravati: భూసమీకరణకు కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మ‌రో 44 వేల ఎక‌రాల భూస‌మీక‌ర‌ణ!?

Amaravati

Amaravati

Amaravati: అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం మ‌రో 44 వేల ఎక‌రాల భూస‌మీక‌ర‌ణకు రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. తూళ్లూరు, అమ‌రావ‌తి, తాడికొండ‌, మంగ‌ళ‌గిరి మండ‌లాలోని గ్రామాల్లోని భూస‌మీక‌ర‌ణ‌ చేపట్టనున్నారు. తూళ్లూరు మండ‌లంలోని హ‌రిచంద్రాపురం, వ‌డ్డ‌మాను, పెద‌ప‌రిమి గ్రామాల్లోని 9919 ఎక‌రాలు.. అమ‌రావ‌తి మండ‌లంలోని వైకుంట‌పురం, ఎండ్రాయి, కార్ల‌పూడి, మొత్త‌డాక‌, నిడ‌ముక్క‌లా గ్రామాల‌లోని..12,838 ఎక‌రాల్లో భూస‌మీక‌ర‌ణ‌ చేపట్టనున్నారు. తాడికొండ‌లోని తాడికొండ‌, కంతేరు గ్రామాలలోని 16,463 ఎకరాలను భూస‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించ‌నుంది సిఆర్డిఏ (CRDA).

Read Also: Pawan Kalyan: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం

అలాగే మంగ‌ళ‌గిరిలోని కాజా గ్రామంలోని 4492 ఎక‌రాల‌ను భూ స‌మీక‌ర‌ణ ద్వార సేక‌ర‌ణ‌ చేపట్టనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూస‌మీక‌ర‌ణకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనుంది సీఆర్డిఏ. ఇప్ప‌టికే రాజ‌ధాని లోని 29 గ్రామాల్లోని 34 వేల ఎక‌రాలు మేర ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకున్న సీఆర్డిఏ. ఇందులో భాగంగా అమ‌రావ‌తి అవుట‌ర్ రింగ్ రోడ్డు కు, ఇన్న‌ర్ రింగ్ రోడ్ కు మ‌ధ్య‌లోని భూముల‌ను సేక‌రించ‌నుంది సిఆర్డిఏ. ఈ భూముల్లో అమ‌రావ‌తికి ఎయిర్ పోర్ట్, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలేం నుండి అమ‌రావ‌తికి వ‌ర‌కు కొత్త‌గా వేయ‌నున్న రైల్వే లైన్ కోసం వినియోగించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం.

Exit mobile version