NTV Telugu Site icon

AP Government: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ప్రభుత్వం..

Chandrababu

Chandrababu

AP Government: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు నవంబర్‌ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలవరించారు.. అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో ర్యాలీలకు సన్నాహాలు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు.. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ.. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.. ఇక, ఏపీలో టీడీపీ శ్రేణులు హంగామా చేస్తున్నాయి.. దీంతో అదనపు నిబంధనలను ఇంపోజ్ చేయాలని కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.. చంద్రబాబు ఎటువంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం..

Read Also: Virat Kohli Birthday: బర్త్‌ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!

Show comments