విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఆఫీసులను వైజాగ్ కు ప్రస్తుతం తరలించడం లేదని చెప్పింది. ఆఫీసులు తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అని ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో జగన్ సర్కార్ స్పష్టం చేసింది.
Read Also: Shivraj Singh Chouhan: శివరాజ్ చౌహాన్‌కి కన్నీటీ వీడ్కోలు.. సీఎం పదవికి రాజీనామా..
కాగా, ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపించాలని రిజిస్ట్రీలో ప్రభుత్వ న్యాయవాది అప్లికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. కార్యాలయాల తరలింపుపై ఏపీ సర్కార్ నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.. దీంతో కార్యాలయాలను తరలించడం లేదని ఉన్నత న్యాయస్థానానికి నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.