NTV Telugu Site icon

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశ‌పెట్టిన ప్రభుత్వం

Ap Assembly Sessions

Ap Assembly Sessions

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు – 2024, ఆంధ్ర ప్రదేశ్ మున్సిప‌ల్ బిల్లు- 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్రవేశ‌పెట్టారు. మరో వైపు.. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చించారు. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించలేదని, కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రకటనలు చేసేటప్పుడు, ఆ అప్పులు గుర్తుకు రాలేదా అని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

Read Also: PM Modi : పేదలకు ఆరోగ్య సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం… దర్భంగా ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని

శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. నాలుగున్నర నెలల పసికూన ప్రభుత్వాన్ని నిందించవద్దని ప్రభుత్వం హితవు పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండలిలో ప్రకటించారు. 15వేల కోట్ల రూపాయలు లోన్ కాదని ,కేంద్ర ప్రభుత్వం లోన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా ఇస్తుందని స్పష్టం చేశారు.