NTV Telugu Site icon

AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం

Kandula Durgesh

Kandula Durgesh

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక యాత్ర చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Read Also: Delhi pollution: యూపీ బస్సుల వల్లే ఢిల్లీలో కాలుష్యం.. ఢిల్లీ సీఎం అతిషి..

కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు ఉంటాయని.. పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అలాగే.. రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ఉదయం 6 గం.లకు బస్సులు ప్రారంభం అవుతాయని.. రాత్రి 7.30కి ప్రయాణం ముగుస్తుందని వెల్లడించారు. మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డ్ డైరెక్టర్ల చేతుల మీదుగా త్వరలోనే ఈ యాత్ర బస్సులు ప్రారంభం కానున్నాయి. పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు రూ. 800 టికెట్ ఉండనుంది. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ కోరారు.

Read Also: Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి