Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ సూచించింది.
Read Also: Chandrababu: ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబులు, ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. డీబీటీ స్కీంల అమల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని ఏపీ సీఈఓకు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఏపీ సీఈఓ సూచించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!