Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది. దీంతో యూరియా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.. మరోవైపు నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. అధికారులు యూరియా కొరత పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందువల్ల కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Read Also: Love: పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. వైజాగ్ తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో యువతి..
ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చే 18 వేల టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42వేల టన్నుల్లో కనీసం 25వేల టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు… మరోవైపు యూరియా వినియోగంపై కూడా కీలక సూచనలు చేసింది ఏపీ సర్కార్.. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రస్తుతం యూరియా కొనుగోలు చేయాలని.. ఫ్యాక్టరీల అవసరాల కోసం యూరియా విక్రయాలు సాగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే..
