NTV Telugu Site icon

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం.. త్వరలోనే సంస్థ విస్తరణ..!

Ap Fiber Net

Ap Fiber Net

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తామని చెప్పారు. త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయన్నారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు.. ఇదంతా కక్ష పూరితంగా జరిగిందని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. దీనిపై విచారణ జరిపి అడ్డగోలుగా వేసిన జరిమానాలను రద్దు చేయాలని నిర్ణయించామని జీవీ రెడ్డి తెలిపారు.

Read Also: Skoda SUV Kylaq: రూ. 7.89 లక్షల విలువైన స్కోడా ఎస్‌యూవీ.. బ్రెజ్జా కంటే ఎక్కువ మైలేజీ!

కేబుల్ ఆపరేటర్లు నుంచి కనెక్షన్ల నుంచి రెంట్ వసూలు చేశారు.. ఈ కనెక్షన్ల మీద వసూలు చేసిన రెంట్లు రద్దు చేయాలని నిర్ణయించామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పేర్కొన్నారు. బినామీలతో అడ్డగోలుగా కాంట్రాక్టులు గత ప్రభుత్వ హయంలో అప్పజెప్పారు.. రూపాయికి 10 రూపాయలు చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగాలను తొలగించినా.. ఒక్కరు కూడా వచ్చి అడిగిన పరిస్థితి లేదని తెలిపారు. దీన్ని బట్టే అన్నీ గతంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయనేది స్పష్టం అయిందని అన్నారు.

Read Also: Karnataka: “భారతమాత హిందువులకు మాత్రమే దేవత”.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కొత్త వివాదం..

ఫైబర్ నెట్ ప్లాన్స్ కూడా రివైజ్ చేస్తాం.. గ్రామాల్లో అందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే బేసిక్ ప్యాకేజ్ అందుబాటులోకి తెస్తామని జీవీ రెడ్డి తెలిపారు. టీటీడీ దేవస్థానం మీద ఉచిత కనెక్షన్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం.. టీటీడీ ప్రతిపాదనలు ఇస్తే తాము ఉచితంగా ఇవ్వటానికి సిద్ధమని అన్నారు. వివిధ రకాల మార్గాల్లో పెట్టుబడులు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం.. 2 నెలల్లో రుణాలు తీసుకుని సంస్థ విస్తరణ చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు.