LV Subramanyam: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మప్రచారానికి టీటీడీ వేదికగా మారాలని సూచించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడడంతో.. టీటీడీలో కూడా మార్పులు వస్తాయని ఆశాభావాని వ్యక్తం చేశారు.. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు వైభవంగా, సక్రమంగా నిర్వహించేలా.. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై టీటీడీ దృష్టి సారించాలన్నారు ఎల్వీ సుబ్రమణ్యం..
Read Also: Paris Olympics: నీరజ్ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్‌పై 30 దేశాలు దాటి పారిస్ కు