Pawan Kalyan Leading in 20 Thousand Votes in Pithapuram: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు మూడు రౌండ్లు ముగియగా.. కూటమి 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 21 సీట్లలో పోటీ చేయగా.. 18 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో తేలిపోయిన జనసేన.. ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలిచేలా ఉంది.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఏకంగా 20 వేల ఆధిక్యంలో ఉన్నారు. ముందునుంచి అనుకున్నట్లే జనసేనాని లక్ష్య మెజారిటీతో గెలిచేలా ఉన్నారు. ప్రచార సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ.. ప్రజల సమస్యలు పవన్ తెలుసుకున్నారు. నేనున్నానంటూ జనాలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్‌కు చాలామంది మద్దతు పలికారు. పవన్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్.. ఓడిపోయిన విషయం తెలిసిందే.
