Waste-to-Energy: ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లోని వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ డిస్కం.. మధ్య ఎంఓయూ కుదిరింది. మున్సిపాల్టీలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ .. చెత్తను విద్యుత్ గా మార్చి సంపద సృష్టిస్తున్నాం అన్నారు. గుంటూరు లో 20 మెగావాట్లు, విశాఖలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో ప్రతి రోజూ 7500 మెట్రిక్ టన్నుల వేస్ట్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు… నెల్లూరు, కాకినాడ, కడప ,కర్నూలులో విద్యుత్ ఎనర్జీ కేంద్రాలతో డిస్కంల ఒప్పందం జరిగిందన్నారు. త్వరలో విజయవాడ, తిరుపతి లో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు సురేష్ కుమార్.. చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.
ఇక, గత ప్రభుత్వం చెత్తపైన కూడా పన్నును వసూలు చేసిందన్నారు మంత్రి నారాయణ… వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను అలాగే ఉంచి పోయిందని.. అక్టోబర్ 2 నాటికల్లా నిల్వ ఉంచిన చెత్తనంతా తొలగించాలని సీఎం ఆదేశించారన్నారు. నారాయణ.. లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అధికారులు తరలించారని… చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 10 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు నారాయణ.. ప్రస్తుతం.. విశాఖ, గుంటూరులో రెండు కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప , కర్నూలులో విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు.. ఇవాళ నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ప్లాంట్లతో డిస్కంలు ఎంవోయూ చేసుకున్నాయని… రోజూ రాష్ట్రంలో 7500 టన్నుల చెత్త వస్తుండగా.. వాటన్నింటితో విద్యుత్ ఉత్పతి చేస్తాం అన్నారు నారాయణ… మరో రెండేళ్లలోనే మరో 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని… మున్సిపార్టీల్లో పీపీపీ విధానంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు… విశాఖ, విజయవాడ, తిరుపతిలో రెండు నెలల్లో ఈ వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ..