NTV Telugu Site icon

DGP Dwaraka Tirumala Rao: గంజాయి, ఎర్రచందనంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..

Dwaraka Tirumala Rao

Dwaraka Tirumala Rao

DGP Dwaraka Tirumala Rao: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి కట్టడి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం.. యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు.. సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నాం.. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు డీజీపీ.

Read Also: Wife Pours Boiling Oil: నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. కారణం ఏంటంటే..

మరోవైపు.. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తున్నాం.. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అన్నారు ఏపీ డీజీపీ.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. పోలీసు అధికారులతో సమావేశమవుతా.. పౌరులను మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. సమాజానికి.. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేస్తాం.. చట్టాన్ని గౌరవిస్తూ.. మానవ హక్కులను ఉల్లంఘించకుండా.. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు.. నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.. ప్రతి జిల్లాలో సవాళ్లను ప్రతి సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం అన్నారు ఏపీ పోలీస్ బాస్‌ ద్వారకా తిరుమలరావు..