Site icon NTV Telugu

AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

Ap Dgp

Ap Dgp

AP Police: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్‌ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ ద్వారక తిరుమల రావు స్పష్టం చేశారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో టీడీఆర్‌ బాండ్ల స్కాంపై సీఐడీ విచారణ?

Exit mobile version