NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: కొండగట్టు, పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్‌.. షెడ్యూల్‌ ఖరారు..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కొండగట్టు, పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు వెళ్లనున్నారు పవన్‌.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి.. స్వామివారిని దర్శించుకొని పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక, జులై 1వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు.. 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

Read Also: Kenya Parliament: హింసాత్మకంగా మారిన నిరసనలు.. కాల్పుల్లో 10 మంది మృతి

ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్‌ కల్యాణ్.. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్‌ కల్యాణ్.. మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కల్యాణ్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చేవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటించబోతున్నారు.