Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చకొట్టడం.. ఇదంతా అతని అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు.. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా.. వైఎస్ జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో..? అని సెటైర్లు వేశారు.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Deadpool & Wolverine: కుర్చీ మడతెట్టడమే అంటున్న ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’ ట్రైలర్
మరోవైపు.. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దాం అని సూచించారు.. ఇక, వైఎస్ జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే అతనికి భంగపాటు తప్పదు అని హెచ్చరించారు.. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతణ్ని పట్టించుకునేవారు లేరంటూ ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
Read Also: CJI DY Chandrachud: పేపర్ లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చు..
కాగా, అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు ఫ్రస్ట్రేషనులో ఉన్నారని ఇంకొందరు సభ్యులు భేటీలో పేర్కొన్నారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్న పలువురు జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు తెలిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించిన విషయం విదితమే.