NTV Telugu Site icon

Deputy CM Mutyala Naidu: భయంతోనే పొత్తులు..! సింహం సింగిల్‌గానే వస్తుంది..

Mutyala Naidu

Mutyala Naidu

Deputy CM Mutyala Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ సభలకు, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలకు ఉన్న ప్రజా స్పందన గమనించండి అని సూచించారు. మాట ఇచ్చిన తరువాత వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచేసే పరిస్థితి ఉండేది.. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అలంటి పరిస్థితి లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో సంక్షేమ – అభివృద్ధి పాలన అందిస్తున్నాం అని వెల్లడించారు.

Read Also: Lal Salaam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇక, గతంలో పాఠశాలలు పెచ్చులు ఊడిపోయేవి, నేడు గ్రానైట్ పలకలతో గదులు సిద్ధం చేశామని తెలిపారు ముత్యాల నాయుడు.. టీడీపీ వ్యతిరేకించినా విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం నేర్పిస్తున్నాం అన్నారు. కానీ, సొంత కూతురుని ఇస్తే.. మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అసలు, చంద్రబాబు అంత బలంగా ఉంటే ఎందుకు జనసేన పార్టీలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బాలయ్య, ఆయన కటుంబ సభ్యులు ఏవిధంగా సహకరించారో అందరికీ తెలుసని దుయ్యబట్టారు. నైతికవిలువలు లేని వ్యక్తి చంద్రబాబు.. బాబుకి ఇప్పుడు భయం పట్టుకుంది.. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. పందులు గుంపుగా వస్తే.. సింహం (సీఎం వైఎస్‌ జగన్‌) సింగిల్‌గా వస్తాడు అని వ్యాఖ్యానించారు.. సింహంలా జగన్ జూలువిదిల్చితే.. ఇతర పార్టీలు అన్నీ బంగాళాఖాతంలో కలిసిపోతాయని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు.