NTV Telugu Site icon

Manickam Tagore: మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది: మాణిక్కం ఠాగూర్

Manickam Tagore

Manickam Tagore

ప్రధాని మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని తన మిత్రులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు ముగిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రధానితో సీఎం వైఎస్ జగన్ పార్టీ తెరవెనుక ఒప్పందం పెట్టుకుందని మాణిక్కం ఠాగూర్‌ పేర్కొన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్‌.. బీజేపీ, టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు.

‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ తన మిత్రులకు అమ్మేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లు ముగిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది. ప్రధానితో జగన్ పార్టీ తెరవెనుక ఒప్పందం పెట్టుకుంది. బీజేపీకి జనసేన మిత్రపక్షం. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఎదురు చూస్తోంది. ఏపీకి జరిగే అన్యాయాన్ని ఈ మూడు పార్టీలు ప్రశ్నించలేవు. బీజేపీ చేసే తప్పులను కాంగ్రెస్ మాత్రమే ప్రశ్నించగలదు. కొత్త ఏడాది సందర్భంగా అందరి ఆకాంక్షలు.. ఈ ఏడాది మీ కోరికలను నెరవేరుస్తుంది’ అని మాణిక్కం ఠాగూర్‌ అన్నారు.

Also Read: Mudragada Padmanabham: ముద్రగడ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారు.. నేను కూడా పోటీ చేస్తా: గిరిబాబు

‘ఏపీలో ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయి. వాలంటీర్లు, గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా జగన్ సర్కార్ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఓట్ల తొలగింపు విషయంలో మరింత పారదర్శకత అవసరం. ఓట్ల జాబితాలో అవకతవకలంటూ వస్తోన్న ఫిర్యాదులపై ఈసీ విచారణ చేపడుతుందా?. తన విశ్వసనీయతను కొత్తేడాదిలోనైనా సీఈసీ నిలబెట్టుకుంటుందా?’ అని మాణిక్కం ఠాగూర్‌ అంతకుముందు ప్రశ్నించారు.