Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పోరాటానికి దిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద నాయకులు ప్రచార వాల్ పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తోందని సంఘం నాయకులు ఆరోపించారు.
ప్రధానంగా రాష్ట్రంలో పేరుకుపోయిన రూ. 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని స్పష్టం చేసింది. దీనితో పాటు ఆలస్యమవుతున్న డిగ్రీ ప్రవేశాలు, విశ్వవిద్యాలయాల అకడమిక్ క్యాలెండర్ల గందరగోళం, నామమాత్రపు తనిఖీలతో విచ్చలవిడిగా సాగుతున్న కార్పొరేట్ విద్యా వ్యాపారంపై గళమెత్తింది. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నాణ్యమైన భోజనం మరియు మెరుగైన వసతులు కల్పించాలని కోరింది.
Also Read
ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే అన్ని కళాశాలలకు ముందస్తు నోటీసులు అందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఆగస్టు 5న చేపడుతున్న ఈ రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం కావడానికి విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఏబీవీపీ విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!