AP CM Jagan Tour: రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Family Doctor

Family Doctor

AP CM Jagan Tour: రేపు(శుక్రవారం) విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్‌ కాలేజ్‌ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) ఆయన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Also Read: Chandrababu: ఒకేసారి సెంట్రల్‌ జైలుకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్.. చంద్రబాబుతో నేడు ములాఖత్

×
×
Ad

శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ప్రాంగణానికి చేరుకుంటారు, అక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్‌ కాలేజీల వర్చువల్‌ ప్రారంభోత్సవం, అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.