NTV Telugu Site icon

CM Jagan Tour: నేడు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

Ys Jagan

Ys Jagan

CM Jagan Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్‌ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు.

అనంతరం ఎండాడలోని కాపుభవన్, భీమిలి ఫిష్ ల్యాండింగ్ పాయింట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read Also: Ambati Rambabu : రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలి

ఇదిలా ఉండగా రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి జగన్‌ నెల్లూరు జిల్లాలోని కావలిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు ముఖ్యమంత్రి జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారు.

Show comments