AP CM Jagan: మన్యం వీరుడు అల్లూరికి సీఎం జగన్‌ నివాళి

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.. అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Read Also: Republic Day: ఈ సారి రిపబ్లిక్‌ పరేడ్‌లో అందరూ మహిళలే.. కేంద్రం కీలక నిర్ణయం

నేడు మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అల్లూరిని స్మరించుకుంటూ పలువురు నివాళులర్పించారు. 1924 మే 7న మన్యంవీరుడు మంప మడుగులో స్నానం చేస్తుండగా బ్రిటిష్‌ వాళ్లకు పట్టుబడ్డారు. అల్లూరిని నులక మంచానికి కట్టి రాజేంద్రపాలెం తీసుకొచ్చారు. అల్లూరిని చింతచెట్టుకు కట్టేసి మేజర్‌ గుడాల్‌ తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవిపేటలో సమాధి చేశారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.