NTV Telugu Site icon

CM YS Jagan: ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. ఆలోచన చేయండి..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందని సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ సభలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని.. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని సీఎం అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని… ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి అంటూ జగన్‌ పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. ఈ ఎన్నికలు మోసాల చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు.

Read Also: Purandeswari: ఏపీలో బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం..

ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని.. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామన్నారు. “నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం జగన్‌ వివరించారు. ఇటువైపు నేను ఒక్కడ్నే, అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్.. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు.. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధమన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధమంటూ సీఎం జగన్‌ వెల్లడించారు. “డబుల్‌ సెంచరీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లు కూడా ముందుకు తీసుకువెళ్దాం..ఈ ఎన్నికల మనకు జైత్రయాత్ర.. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం.. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి.. వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి.. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి.” అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

Read Also: Kodali Nani: అలా ఒక్కరితో చెప్పించినా పోటీ చేయను.. ప్రచారంలో కొడాలి నాని సవాల్

రూ.2లక్షల 77 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 58 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, మత్య్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, ముప్ఫు లక్షల ఇళ్ల పట్టాలు.. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. చదువులకు అనుసంధనం చేస్తూ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అమలు చేశామన్నారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుందని సీఎం జగన్‌ విమర్శించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయన్నారు. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా అంటూ సీఎం ప్రశ్నించారు.” పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?” సీఎం ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ మరొకసారి మోసం చేయడానికి వస్తున్నాడని ఆయన మండిపడ్డారు.