NTV Telugu Site icon

AP CM Jagan: నరకాసురుడినైనా నమ్మండి.. కానీ నారా చంద్రబాబును నమ్మొద్దు..

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. దేశంలో పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాలు చూశామన్నారు. కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని.. యాభై వేల మందికి ఇల్లు ఇస్తామంటే మారీచులు ,రాక్షసులు లాంటి ప్రతిపక్షాలు అడ్డు పడ్డాయని ఆయన మండిపడ్డారు. పది లక్షలు విలువ చేసే స్థలాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇస్తుంది ఇళ్ల పట్టాలు కాదు… సామాజిక న్యాయ పత్రాలు అంటూ జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఏ ఒక్కరికీ సొంతం కాదు… భవిష్యత్‌లో అమరావతి అందరిదీ కావాలన్నారు. 25 లే ఔట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు ఇక్కడ పట్టాల పంపిణీ పండుగ జరుగుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో యుద్ద ప్రాతిపదిక ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. వారం పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్‌ ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు

ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్‌ ప్రకటించారు. ఎన్నికలు వస్తున్నాయ్ అనగానే చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్తాడని…. అమలు కానీ మేనిఫెస్టో ప్రచారంలోకి తెస్తాడంటూ ఆరోపించారు. నరకాసురుడినైనా నమ్మండి.. కానీ నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దంటూ విమర్శలు గుప్పించారు. ఆర్ధికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా నవరత్నాలు అమలుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశామన్నారు. వైసీపీ సర్కారు మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంలా భావించిందన్నారు. వైసీపీ పాలనలో లంచం,అవినీతి , వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.

Read Also:
Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు
సంక్షేమ పథకాలు తట్టుకోలేని గజదొంగల ముఠా దోచుకోవడం పంచుకోవడం అన్నదే ధ్యేయంగా ఉన్నారన్నారు. పేద వాడిపై యుద్దానికి పెత్తందారులు సిద్ధంగా ఉన్నారని.. అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వకుండా కోర్టులలో కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడికి స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నారని ఈ సందర్భంగా చెప్పారు. సంక్షేమ పథకాల వల్ల పేదలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు అన్న అక్కసుతో చంద్రబాబు , దొంగల ముఠా ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు.