CM YS Jagan: తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: PM Modi: పార్లమెంట్‌లో ఓటమి కోపాన్ని వెళ్లగక్కకండి… విపక్షాలపై ప్రధాని మోడీ నిప్పులు
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచౌంగ్ తుఫాను కదులుతోంది. గంటకు 14 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఆ సంస్థ డైరెక్టర్ చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది. రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది.
దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!