NTV Telugu Site icon

CM YS Jagan: అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఎల్లుండి విజయవాడలో అంబేడ్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్‌ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అంబేడ్కర్‌ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్‌ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని, సామాజిక న్యాయ’మహా శిల్పమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్‌ విగ్రహమని ఆయన తెలిపారు.

Read Also: AAG Sudhakar Reddy: చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది: అదనపు అడ్వొకేట్ జనరల్

81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన… 125 అడుగుల మహా శిల్పం.. మొత్తంగా 206 అడుగుల ఎత్తైన విగ్రహమని సీఎం స్పష్టం చేశారు. ఆ మహానుభావుడిది ఆకాశమంతటి వ్యక్తిత్వమని, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా అంబేడ్కర్‌ భావజాలం ఉందన్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో ప్రభుత్వం అనుసరించిందన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని సీఎం ప్రజలకు సూచించారు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన

అంటరానితనం, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని ఆయన చెప్పారు. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం.. రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి.. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి అంబేడ్కర్ అంటూ సీఎం కొనియాడారు. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా, పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపారని అంబేడ్కర్‌ గొప్పదనాన్ని ముఖ్యమంత్రి కీర్తించారు. ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావాలు అంటూ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Show comments