NTV Telugu Site icon

AP CM Jagan Tour: రేపు వైఎస్సార్ జగనన్న కాలనీని ప్రారంభించనున్న సీఎం జగన్‌

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan Tour: రేపు(గురువారం) కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ కానున్నారు. అనంతరం సామర్లకోటకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్‌ చేరుకోనున్నారు.

Also Read: AP CM Jagan: ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి..

సామర్లకోటలో రేపు వైయస్సార్ జగనన్న కాలనీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 57 ఎకరాలలో 2412 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. దశలవారీగా లబ్ధిదారులకు సర్కారు ఇళ్లను అందజేస్తోంది. రెండు ప్రాంతాలలో జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేశారు. సెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం లక్షా 80 వేలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.