AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని ఆయమ మండిపడ్డారు. లంచావతారాలు.. గజ దొంగలు.. వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలు.. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ బిడ్డను ఎదుర్కోలేక… పలానా మంచి పని చేశామని చెప్పుకోలేక.. ప్రతిపక్షాలు జిత్తులు, ఎత్తులు, పొత్తులతో కుయుక్తులు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. వీటితోనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మీ బిడ్డ ఒక్కడు ఓ వైపు నవరత్నాలతో ఎదురుగా వస్తుంటే.. అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక తోడేళ్లు ఒక్కటవుతున్నాయని సీఎం విమర్శించారు. తనకు అంగబలం, అర్థ బలం, మీడియా బలం లేదని..దే వుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయన్నారు. పొత్తులపై ఆధారపడనన్న ముఖ్యమంత్రి.. తనకు ఎవరితోనైనా పొత్తు అంటే.. అది ప్రజలతోనేనన్నారు. కారణం తనకు కుయుక్తులు చేతకాదు, అబద్ధాలు చెప్పలేను.. మోసం చేయలేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
Read Also: Vidadala Rajini: నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే.. మంత్రి భావోద్వేగం
‘నాకు పన్నాగాలు, జిత్తులు చేతకాదు. నేను నేరుగా చెప్తాను.. ఏది చెప్తానో.. అది చేస్తాను:అందుకే ప్రతి విషయంలోనూ ఆలోచనలు చేయాలని చెప్తున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి… సైనికులుగా నిలవండి. మీ బిడ్డకు ఉన్నది మీరే. మీరే సైనికులు కావాలని కోరుతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితే.. మీ బిడ్డకు తోడుగా నిలవండి.’ అని సీఎం జగన్ అన్నారు.
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!