Site icon NTV Telugu

CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్‌ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయని ఆయన విమర్శించారు. తుగ్గలి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 29.65 కోట్లు ఇచ్చామని.. రాతన గ్రామంలో 95 శాతం కుటుంబాలకు లబ్ది జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read Also: Bharat Ratna : భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు

పంట ఉంటే గిట్టుబాటు ధర ఉండదు. ధర ఉంటే పంట ఉండదు. రైతుల పరిస్థితి బాగాలేదని.. రైతులకు పెన్షన్లు ఇవ్వాలని ఓ రైతు డిమాండ్ చేశారు. తుగ్గలి మండలంలో రైతుల పరిస్థితి అద్వానంగా ఉంది. కాబట్టి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జగన్‌ను మరో రైతులు కోరారు. తుగ్గలి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఓ మహిళ జగన్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. కాసేపట్లో అనంతపురం జిల్లాలోకి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రవేశించనుంది. కర్నూలు జిల్లాలో సాగిన యాత్రలో జనం అడుగడుజనా సీఎం జగన్‌కు నీరాజనం పట్టారు. ఎమ్మిగనూరు సభకు వైసీపీ శ్రేణులు భారీగా పోటెత్తారు. పెంచికలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపిస్తూ జనం సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు.

Exit mobile version