NTV Telugu Site icon

CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్‌.. కేసీఆర్‌తో కీలక భేటీ!

Cm Jagan

Cm Jagan

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్‌ గజ్వేల్‌ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. కొద్దికాలం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు, బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు.

Read Also: Pawan Kalyan: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వానం

అనంతరం కేసీఆర్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తనయుడు కేటీఆర్‌కు ఫోన్‌ చేసిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా గురువారం సీఎం జగన్‌ నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. కేసీఆర్‌ ఇంటికి వెళ్తున్న జగన్‌ లంచ్‌ మీటింగ్‌కు హాజరవుతారని సమాచారం.

 

Show comments