Sharathulu Vartisthayi: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’ లిరికల్ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన “షరతులు వర్తిస్తాయి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచ ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – దర్శకుడు కుమారస్వామి నాకు చాలా కాలంగా తెలుసు, బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి అని అన్నారు. ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోందన్న ఆయన సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం ఆకట్టుకున్నాయన్నారు. ఇక ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నాన్న ఆయన నేను ఫిదా సినిమాలో వచ్చిండే పాట రూపొందించినప్పుడు అదే ఆశించానన్నారు.
Also Read; Minugurulu: ‘మిణుగురులు’కి పదేళ్లు… అమెరికాలో స్పెషల్ షో!
Also Read
తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయనీ, చైతన్య రావ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా చేస్తున్నాడన్నారు. హంగూ ఆర్భాటం లేకుండా తక్కువ ఖర్చుతో సింపుల్ గా పెళ్లి ఎలా చేసుకుందామో చెప్పు అంటూ హీరో చైతన్య హీరోయిన్ ను అడిగినప్పుడు హీరోయిన్ ‘ పెళ్లి లైఫ్ లో ఒక్కసారే చేసుకుంటాం, గ్రాండ్ గా ఉండాలి. పెళ్లిలోని ప్రతి సందర్భం జీవితమంతా గుర్తుండిపోవాలి..’ అని సమాధానం చెచ్చి హీరోను ఒప్పిస్తుంది. అలా పెళ్లి నేపథ్యంగా ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా..’ పాట సాగుతుంది. ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా.. పచ్చని పందిట్ల ముత్యాల పోలు..ముత్యాల పోలు మీద గజ్జెళ్ల కాని..గజ్జెళ్ల కాని మీద పెండ్లి పీటలు…’ అంటూ పెళ్లిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని వర్ణిస్తూ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ ఆకట్టుకునేలా ఈ పాట రాశారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి చేసిన కంపోజిషన్ అంతే నేటివిటీతో అందంగా ఉంది. మొగుళ్ల శంకరమ్మ, శంకర్ బాబు, తేలు విజయ, వొల్లల వాణి ఈ పాట పాడగా ఆకట్టుకునే విధంగా ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!