NTV Telugu Site icon

Chandrababu: నేటి నుంచి ప్రజాపాలన మొదలైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

Chandrababu: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 2003లో క్లైమోర్ మైన్స్ పేలుడు సమయంలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడమే తన ధ్యేయమన్నారు. ఏపని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేదవారికి అందేలా చేయడం అంతే ముఖ్యమన్నారు. ఇవన్నీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెడతాననని హామీ ఇచ్చారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని.. కొందరు దాడులు చేసి మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదన్నారు. మంచివారిని కాపాడుకోవాలి, చెడ్డవారిని శిక్షించాలన్నారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని.. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు.

Read Also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్‌లో శాఖల కేటాయింపు?.. పవన్‌కు కీలక శాఖలు !

దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నామని.. వేంకటేశ్వర స్వామి నిద్రలేచిన వెంటనే ప్రార్థనా చేస్తానని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రోజు కోరుకుంటానన్నారు. పరిపాలనా అంటే సెక్రటేరియట్ నుంచి ప్రజల మధ్య నుండి పరిపాలనా సాగేలా చూశానన్నారు. వేంకటేశ్వర స్వామిని ఒక్కటే కోరికను కోరానని.. దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని చెప్పిన చంద్రబాబు.. ఆ కుటుంబ వ్యవస్థ కలకాలం ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రపంచం వ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాలను నిర్మాణం చేపట్టాలని, చేపట్టే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సంపదను సృష్టించడంతో పాటు పేదవారికి అందేలా చూస్తామన్నారు. మా కుటుంబానికి తాను ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని.. వారికి కాస్త సమయం కేటాయిస్తే చాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టే సంస్కృతి మానడం లేదని.. ఇక నుంచి ఆ పద్ధతి మారుస్తామన్నారు. నేను అందరినీ వాడిని, ఐదుకోట్లమంది ప్రజాప్రతినిధినని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతిలను నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని నిర్మించి ప్రజలకు అందజేస్తామన్నారు.

తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమని, అలాంటి తిరుమలను అపవిత్రత చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలో గోవింద నామం, ఓం నమో వెంకటేశాయ శ్లోకం తప్ప ఏది వినపడకూడదన్నారు. తిరుమలలో మద్యం,గంజాయి, అన్య మత ప్రచారం సహా అన్ని అసాఘింక కార్యక్రమాలకు అడ్డా మార్చారని మండిపడ్డారు. తిరుమల పవిత్రను నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. కోర్టు కేసులు, లాబియింగ్ కోసం తిరుమలను వాడుకుంటారా అని ప్రశ్నించిన ఆయన.. వేంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.