NTV Telugu Site icon

CM YS Jagan: నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్

Jagan

Jagan

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు. 50నియోజక వర్గాల నుండి  పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. సభా వేదిక ముందు ఫ్యాన్ గుర్తు ఆకారంలో వాకింగ్ వేను ఏర్పాటు చేశారు. 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై భారీ వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. బందోబస్తు విధుల్లో 3,298 మంది పోలీసులు పాల్గొననున్నారు. 50 నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు రూట్ మ్యాప్‌లో పోలీసులు తెలియజేశారు. ఏడు ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు.

Read Also: MRO Killed: అర్ధరాత్రి తహసీల్దార్‌ దారుణహత్య.. ఇనుప రాడ్డులతో దాడి

నేడు మధ్యాహ్నం సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. ఏలూరులో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి “సిద్ధం” సభ.. షెడ్యూల్‌ ఒకసారి పరిశీలిస్తే.. ఇవాళ మధ్యాహ్నం 3:20నిమిషాలకి దెందులూలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం జగన్‌. 3:30కి సభా ప్రాంగణం కు చేరుకోనున్న సీఎం జగన్‌… 3:30నుంచి 4:45 వరకు ప్రసంగిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.