సూడాన్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలన్నారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా నిలవాలన్నారు సీఎం జగన్. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా. మరోవైపు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సూడాన్ లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సూడాన్ లో చిక్కుకున్న తెలంగాణ వారిపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం…ఆపరేషన్ కావేరి లో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికారులతో సమీక్ష జరుపుతున్నారు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.
Read Also: Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం