NTV Telugu Site icon

CM Chandrababu: లిక్కర్, ఇసుక వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దు.. సీఎం క్లియర్ వార్నింగ్

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే… అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల‌ నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు. ఒక నాయకుడు జైలుకు వెళ్ళాడు.. ఒక నాయకుడు టార్చర్ అనుభవించాడని పేర్కొన్నారు. ఏ కార్యకర్త తప్పు చేసిన అది సీఎం మీద పడుతుందన్నారు. మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్నారు. 7 శ్వేత పత్రాలు ముందుగానే ఇచ్చామన్నారు.

గత ప్రభుత్వంలో సహజ వనరులను దోచుకున్నారన్నారు. నిన్న హిందూపూర్‌లో జరిగిన నేరం వెనుక గంజాయి బ్యాచ్‌లే ఉన్నాయన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం లేదని తెలిపిన సీఎం చంద్రబాబు… కొంతవరకూ కేంద్రం సహకరించింది కనుక నిలబడగలిగామన్నారు. ఎన్డీఏ కూటమి ఉంటే తప్ప మనం నిలబడే అవకాశం లేదన్నారు. ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలన్నారు. 5ఏళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను అర్థం చేసుకోవాలన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు.

Read Also: AP Crime: హైదరాబాద్‌లో లవ్‌.. ఏపీలో ఆత్మహత్య.. ఆ ఒక్కటే కారణం..!

వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందన్నారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదని.. కేంద్ర నిధుల్ని సైతం ఇష్టానుసారం మళ్లించేశారన్నారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన యాక్ట్ తెచ్చారని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ రావాలన్నారు. డిసెంబర్ నాటికి స్కిల్ సెన్సస్ అవుతుందని సీఎం తెలిపారు. నెల మొదట్లోనే పెన్షన్లు, జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. పాత మద్యం దోపిడీలపై చర్యలు తీసుకుంటూనే కొత్త మద్యం పాలసీలు తెచ్చామన్నారు. ఇసుక పాలసీలో మార్పులు తెచ్చామని.. ఇప్పటికే మద్యం వ్యాపారాలలో ఉన్నా వారు మినహా ఎవ్వరూ అందులోకి వెళ్ళకుండా డిసిప్లీన్‌తో ఉండాలన్నారు. లిక్కర్, ఇసుక వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దన్నారు. విజయవాడ వరదల్లో రాత్రింబవళ్ళు పని చేశామన్నారు.గత ప్రభుత్వం చేసిన సమస్యల వల్ల బుడమేరుకు వరద వచ్చిందన్నారు. విజయవాడే ఒక చెరువులా మారిపోయిందన్నారు. స్వచ్ఛందంగా చాలా మంది 450 కోట్లు ఇచ్చారన్నారు. ప్రతీ ఒక్క కుటుంబానికి 25 వేలు ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.

పదివేలు ఆటోలకి, టూవీలర్‌లకి 3వేలు ఇచ్చామన్నారు. విజయవాడ వరదలు ఒక ప్రత్యేక కోణమని, వరదలలో పునరుద్దరణ చాలా కష్టంతో జరిగిందన్నారు. 4.15 లక్షల మందికి 618 కోట్లు డీబీటీ ద్వారా అందించామన్నారు. రూ.1674 కోట్లు రైతుల బకాయిలు చెల్లించామని.. ఇప్పుడు 24 గంటల్లో ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. రూ.4700 కోట్లతో పల్లె పండుగ పనులు ప్రారంభించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ పనులు ప్రారంభించారని చెప్పారు. సంక్రాంతి పండుగ కంటే ముందే రోడ్లు అన్నీ సిద్ధం కావాలని ఆదేశించామన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉందని మచిలీపట్నంలో తెలిసింది..చెత్త కూడా సంపదే… దీనిపై ఎంఎల్ఏలు దృష్టి పెట్టాలన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు.

Read Also: IAS Officers Meet CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్‌లు..

ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే కంపెనీలకి 10 శాతం వరకూ ఇన్సెంటివ్ ఇస్తామన్నామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక హెడ్ క్వార్టర్స్ పెడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ ఇంటికి ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండాలి‌.. దానికి రతన్ టాటా ఒక గుర్తు కావాలన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడతామన్నారు. చెత్తపన్ను రద్దు చేశామని… 277 జీఓ రద్దు చేశామన్నారు. 95 శాతం రిజర్వాయర్లలో నీళ్ళు వచ్చాయన్నారు. కడప బ్రహ్మసాగర్‌లో కూడా నీళ్ళు పెరుగుతున్నాయన్నారు. పీఏబీఆర్‌కు కూడా నీళ్ళు తీసుకొస్తామని.. హంద్రీనీవాకు కూడా నీళ్ళిస్తామన్నారు. పాయకరావుపేట దగ్గర నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ వస్తుందన్నారు. సముద్రం పక్కన 20వేల ఎకరాలు వస్తుంది.. ఇది కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్‌కు వినియోగిస్తామన్నారు. 75వేల కోట్లతో బీపీసీఎల్‌తో పెట్రో కెమికల్ కారిడార్ వస్తుందన్నారు.

విశాఖ రైల్వేజోన్ కు లైన్ క్లియర్ అయింది… త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. జనాభా దామాషాకు అనుగుణంగా టీడీపీ పదవులిస్తుందన్నారు. గత ప్రభుత్వం పదవులు ఇవ్వడానికి తెచ్చిన రిజర్వేషన్‌కు హేతుబద్ధత లేదన్నారు. దీపావళికి సూపర్ సిక్స్‌లో భాగంగా వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చే పాలసీ తెస్తామన్నారు. 2029కి మళ్ళీ గెలవాలంటే NDA తో అనుసంధానం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలు అనుసంధానం చేసుకోవాలన్నారు. మళ్ళీ గెలవాలంటే ప్రజల్లోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు తీసుకెళ్ళాలన్నారు. ప్లానింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో మూడు పార్టీల అధ్యక్షులని కూచోపెట్టి మాట్లాడాలన్నారు. ఎన్నికలు అయిపోయాయి అని ఏకపక్షం గా వెళ్ళకూడదన్నారు. ఎవరిదారి వాళ్ళు చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయన్నారు. ఎంఎల్ఏలు తెచ్చే సమస్యలు సమంజసమే అయితే మంత్రులు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

Show comments