CM Chandrababu: మంత్రులకు మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
- మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. పవన్ వ్యాఖ్యలు..కొంత మంది అధికారుల తీరుపైనా మంత్రులతో చర్చ
- మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచన
- చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కొంతమంది అధికారుల తీరుపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. అలాంటి అధికారుల తీరు కారణంగానే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మంచిగా ఉండొచ్చు… కానీ మెతకగా ఉండకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు పనితీరును మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. . చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: AP Cabinet: సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారన్నారు. ఇలా అయితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా?…అందువల్లే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!