NTV Telugu Site icon

AP CM Chandrababu: గండికోటలో కూడా సీప్లేన్ ఆపరేషన్స్.. సీఎం చంద్రబాబు ప్రకటన

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

AP CM Chandrababu: గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గండికోటలో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ చేస్తామని సీఎం ప్రకటించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, కోనసీమ, అరకు వ్యాలీ, లంబసింగి…ఇవన్నీ కలుపుతూ చేయగలిగితే ప్రపంచంలో టూరిజం డెస్టినేషన్ అవుతుందన్నారు. టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చామని.. అన్ని సెక్టార్ల కంటే టూరిజంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. టూరిజం లో 4 నుంచి 6 శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయి విధ్వంసం జరిగిందని… అభివృద్ధి గురించి ఆలోచించాలంటే భయవుడే పరిస్థితి ఉందన్నారు. నేను నాలుగోసారి సీఎం, మూడుసార్లు సీఎంగా ఉన్నపుడు ఇంత ఇబ్బంది లేదన్నారు. బ్రాండ్ ఏపీని నాశనం చేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

Read Also: CM Chandrababu on seaplane: సీ ప్లేన్‌, బోట్లు, రోడ్డు రవాణా లింక్‌ చేయాలి.. అధికారులతో సీఎం..

విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలంలో పరమశివుడిని దర్శనం చేసుకోవడం అదృష్టమని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం రావడం కష్టంగా ఉందని.. రవాణా ఇబ్బందిగా ఉందన్నారు. శ్రీశైలం చుట్టూ వన్యప్రాణుల అభయారణ్యం, జలాశయం ఉన్నాయని.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినపుడు ఆహ్లాదంగా ఉంటుందన్నారు. రోప్ వే ఉంది, తానే ప్రారంభించానని తెలిపారు. సీప్లేన్ లోనుంచి దిగితే అద్భుతమైన అనుభూతి పొందానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇన్నేళ్ళుగా విమానాల్లో తిరిగినా సీప్లేన్ లో ప్రయాణం కొత్త అనుభూతి అనిపించింది.. సీప్లేన్ రన్ వే వాటర్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నారు. విజయవాడ, శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రాలు అని… తిరుమలలో కూడా పచ్చదనం బాగుంటుందన్నారు. శ్రీశైలం లో ఏడాది ఉంటే ఎక్కువ కాలం బతుకుతారని ఆయన తెలిపారు. శ్రీశైలం చుట్టూ అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయన్నారు. శ్రీశైలం స్పిరిచువల్, రిలీజియస్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉందన్నారు. 2014-19 మధ్య శ్రీశైలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. జంగిల్ సఫారీ కూడా ఇక్కడ బాగుందన్నారు. మంత్రులు పవన్ కళ్యాణ్, ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్‌తో కమిటీ వేసి అభివృద్ధికి ప్రణాళికలు వేసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలోనే రిపోర్ట్ ఇస్తారని.. సున్నిపెంటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడ నివసించే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

Read Also: CM Chandrababu: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని, దాని నుంచి బయటకు వచ్చామన్నారు. దీనికి కారణం ఎవరు, ఇప్పుడు కేంద్రం సహకరించకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గెలిచారు, పునర్నిర్మాణం ప్రారంభమైందన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నాశనం చేశారని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తీసుకురాగలిగితే బిగ్ గేమ్ చేంజర్ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అదే జరిగితే రాయలసీమ మళ్లీ రాయలసీమ రతనాల సీమ అవుతుందన్నారు. ఓర్వకల్‌ను డ్రోన్ సిటీగా చేస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆడపిల్లల జోలికొస్తే జాగ్రత్త అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు. తీవ్రవాదులను, ముఠానాయకులను ఎదుర్కొన్నామన్న సీఎం చంద్రబాబు.. రౌడీలు, నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఒకటి రెండు తప్పు చేసినా పరిస్థితి మారకుంటే అదే ఆఖరు రోజు అవుతుందని హెచ్చరించారు. వైసీపీ నేతలు భార్యలపై పోస్టింగ్స్ పెట్టినా వదిలిపెట్టనన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి ఎలా నీళ్లు తీసుకురావాలో ఆలోచిస్తున్నామన్నారు.

 

Show comments