Site icon NTV Telugu

CM Chandrababu: ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. ఆగస్ట్ 15న ఉచిత బస్!

Cm Chandrababu Ap

Cm Chandrababu Ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు.ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ మనసుపెట్టి పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 175 నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం భారత్. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అలానే రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం. డీప్ టెక్‌తో టెక్నాలజీ బాగా పెరిగింది. వాట్సాప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయి. 2 నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సాప్లో ఉంటాయి. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జ్ టూల్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఆదాయం పెరగాలి.. అందరూ ఆరోగ్యం, ఆనందంగాఉండాలి. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారు అయింది. 26 జిల్లాల్లో రోడ్ మాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది’ అని చెప్పారు.

Also Read: CM Chandrababu: ఇకపై ఏ రహదారి నిర్మాణం ఆలస్యం కాకూడదు!

‘కొన్ని నియోజక వర్గాల్లో పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొన్ని నియోజక వర్గాల్లో వ్యవసాయం తక్కువ, ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ఆక్వా, డైరీ.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో అనుకూలమైన సర్వీస్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. హాస్పిటల్, టూరిజం.. ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలి. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. ఆగస్ట్ 15న ఉచిత బస్ మహిళలకు అందుబాటులోకి వస్తుంది. సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం. P4పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గివ్ బాక్ కల్చర్ పెరగాలి. మనం ప్రజలపై ఇన్వెస్ట్ చెయ్యాలని కోరుతున్నాం. ఎమ్మెల్యేలు మనసు పెట్టి పని చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం. సహజ వనరులు, రోడ్లు, పర్యావరణం, పారిశ్రామిక అభివృద్ధి వంటి వాటిపై ఫోకస్ పెట్టాలి’ అని సీఎం చెప్పుకొచ్చారు.

Exit mobile version