NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. త్వరలో ప్రాజెక్టు సందర్శన..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, పాలనపై ఫోకస్‌ పెట్టారు.. ఈ రోజు తన కేబినెట్‌లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించిన ఆయన.. మరోవైపు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే, సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది.. ఇక, శ్వేత పత్రాల విడుదలకు కూడా సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతీసోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ.. పనులపై సమీక్ష నిర్వహిస్తూ వచ్చిన విషయం విదితమే.

Read Also: EPFO: చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్‌ సదుపాయం నిలిపివేత

మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడుతోనే పూర్తతుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుకు జలవనల శాఖను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రైతు సంఘాల ఆధ్వర్యంలో కాటన్ దొర విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి రైతులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రైతుబిడ్డ నిమ్మలకు జలవనుల శాఖ కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. రైతు బిడ్డ రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.