NTV Telugu Site icon

CM Chandrababu: ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు. సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాలో తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు.

Read Also: Botsa Satyanarayana: డయేరియా మరణాలకు కూటమి సర్కారే కారణం.. బొత్స కీలక వ్యాఖ్యలు

ఇసుక కొరత సమస్యను అధిగమించడం కోసం రీచుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయించడంపై అధికారులు సమీక్షించాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలన్నారు. అంతరాష్ట్ర ఇసుక సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా ఎక్కడైనా దుర్వినియోగం చేసినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.