Site icon NTV Telugu

CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు

Cbn

Cbn

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సీఎం.. అయితే, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు ఉన్నాయి.. రేపు ఉదయం 10 .30 కు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు.. మధ్యామ్నం 12.30 కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్‌తో భేటీ ఉండగా.. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం ఫిక్స్‌ చేశారు.. ఏపీ నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అమిత్ షాతో చర్చించబోతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

Read Also: Pravasthi Aradhya: కీరవాణి, సునీతపై సింగర్ సంచలన ఆరోపణలు..

అయితే, ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కాగా.. రేపు ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది.. గతంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయగా.. రెండు స్థానాలను టీడీపీ తీసుకోగా మరో స్థానం బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది.. అయితే, సంఖ్యా బలం రీత్యా కూటమికి దక్కనున్నాయి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం.. ఖాళీ అయిన రాజ్యసభ అభ్యర్థిపై ఇప్పటికే ప్రచారంలో పలు పేర్లు వినిపిస్తుండగా.. బీజేపీ కోటాలో ఎవరికి ఇస్తారనే దానిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.. ఈ సమయంలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..

Exit mobile version