NTV Telugu Site icon

Chandrababu Naidu Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కనీవినీ ఎరుగని ఏర్పాట్లు! షెడ్యూల్ ఇదే

Chandrababu Naidu

Chandrababu Naidu

AP CM Chandrababu Naidu Tour Today: రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట.

తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు.. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని తెలుస్తోంది.

మొదటిరోజు హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరుసటిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సీఎం టూర్ స్టార్ అవుతుంది. సాయంత్రం 4.10కి సీఎం పర్యటన ముగ్గుస్తుంది.

మంగళవారం కార్యక్రమాలు:
మ.12.30కు పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి ఆగమనం
మ.12.55కు శాంతిపురం జల్లిగానిపల్లి గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలన
మ.1.35కు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలన
మ.02.10కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం– విరామం
మ.3.00లకు ఎన్టిఆర్ విగ్రహం కూడలిలో బహిరంగ సభ
సా.4.35కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం

బుధవారం కార్యక్రమాలు:
ఉ.10.30 గంలకు ఆర్ అండ్ బి అతిథి గృహం- ప్రజా ఫిర్యాధుల స్వీకరణ
మ.12 గంలకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (పిఈఎస్ కళాశాల సమీపంలో)- నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశం
మ.02.35 గంలకు పిఈఎస్ మెడికల్ కాలేజీ – పార్టీ శ్రేణులతో మీటింగ్
సా.4.10 – పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి తిరోగమనం