NTV Telugu Site icon

CM Chandrababu: చంద్రబాబు భావోద్వేగం.. మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా..

Babu

Babu

CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు.. భావోద్వేగానికి గురయ్యారు.. మళ్లీ జన్మ అనేది ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుడుతాను అన్నారు.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. మీ అభిమానం మరువలేనిది.. కుప్పం ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను అన్నారు. కుప్పం నుండి ఎనిమిది సార్లు నన్ను ప్రతిసారి భారీ మెజారిటీతో గెలిపించారు.. మళ్లీ జన్మ అనేది ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుడుతాను.. మీ రుణం తీర్చుకుంటాను అని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు.. ప్రజాసామాన్యంలో ఎవరైనా అతిగా విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే పడుతుంది.. కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశారు.. చిత్తూరు జిల్లాలో ఏడుకి ఏడు సీట్లలో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Ntr Film Awards: ‘ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’కి విశిష్ట అతిథులుగా తెలంగాణ మంత్రులు

నా రాజకీయ జీవితంలో కుప్పం ఒక ప్రయోగాశాలగా చూస్తాను అన్నారు సీఎం చంద్రబాబు.. ఏ అభివృద్ధి పని అయిన ఇక్కడ నుండే ప్రారంభిస్తాను అన్నారు. ఎమ్మెల్యేలందరూ బాగా చదవుకున్నారు.. యువతకు మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చాం.. ఐదేళ్లల్లో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు. గత ఐదేళ్లు రౌడియిజం, దౌర్జన్యం, అరాచకాలు ఎన్నో చూశాం.. కేజీఎఫ్‌ ను మరచిపించే విధంగా కుప్పంలో గ్రానైట్ దోపిడి చేశారు.. కుప్పానికి నేను వస్తున్నాను అంటే అడ్డుకోవడానికి చూశారు.. నాకోసం వచ్చిన కార్యకర్తల మీదా కేసులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చేబుతున్నా.. ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేయాలని చూసినా.. చేసినా.. మీకు అదే చివరి రోజు అవుతుందంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇక, తన సొంత నియోజకవర్గంపై కుప్పంపై వరాల జల్లు కురిపించారు సీఎం.. తొలిసారి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయన.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. ఓవైపు వర్షం జల్లు పడుతుండగా.. మరోవైపు.. వరాల జల్లు కురిపించారు సీఎం.. కుప్పంలో ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తాం… అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాను.. కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుండే ప్రారంభిస్తాం.. ప్రతి ఇంటి తాగునీరు అందిస్తాం.. పచ్చదనానికి కేరాఫ్ కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించిన విషయం విదితమే.. అంతేకాదు.. కుప్పానికి ఎయిర్‌పోర్టు తీసుకొని రావాలి అన్నది నా కల.. వీలైనంత త్వరగా కుప్పానికి విమానాశ్రయం తీసుకొని వస్తాను. ఎయిర్ కార్గ్ ద్వారా మన పంటల్ని విదేశాలకు పంపేలా చూస్తాను అని ప్రకటించారు చంద్రబాబు.